సచివాలయాల వారీగా చేదోడు రీ వెరిఫికేషన్ రిపోర్ట్ చెక్ చేయు విధానం.
జగనన్న చేదోడు లబ్ధిదారులకు గతం లో వెరిఫికేషన్ చేయు సమయంలో వారి వస్తువులు కనపడేలా ఫోటో లు అప్డేట్ చేయనందు వలన మరలా వెరిఫికేషన్ చేయుటకు కొత్తగా చేదోడు రీవెరిఫికేషన్ జాబితాను(ఫోటోలు సరిగా లేని వారి జాబితా మాత్రమే) విడుదల చేయడం జరిగింది. అట్టి వారి జాబితాను రీ వెరిఫికేషన్ చేయడానికి Chedodu Re-Verification App ను విడుదల చేయడం జరిగింది. సచివాలయాల వారీగా రీ వెరిఫికేషన్ జాబితాను ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లను రీ వెరిఫికేషన్ చేశారో ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకో వచ్చు.
చేదోడు రీ వెరిఫికేషన్ చేయు విధానం
పై(Chedodu Re-Verification Report) లింక్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా జిల్లాల వారీగా రీ వెరిఫికేషన్ రిపోర్ట్ కనిపించడం జరుగుతుంది.

ఇక్కడ ముందుగా మన జిల్లాను ఎంచుకోవాలి,మన జిల్లా లోని మండలాల జాబితా ఓపెన్ అవడం జరుగుతుంది.మన మండలాన్ని ఎంచుకోవాలి ,మండలం లోని సచివాలయాల జాబితా కనిపించడం జరుగుతుంది.
ఇక్కడ మన సచివాలయం లో ఎన్ని అప్లికేషన్లు రీ వెరిఫికేషన్ కి వచ్చాయి వాటిలో ఎన్ని రీ వెరిఫికేషన్ చేశారు ,ఎన్ని అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి ,ఇంకా సర్వే చేయవలసిన అప్లికేషన్లు వున్నాయి తెలుసుకోవచ్చు
గమనిక :- రీ వెరిఫికేషన్ కి వచ్చిన రిపోర్ట్ మాత్రమే చూడగలం.(లబ్ధి దారుల వివరాలకు సచివాలయాన్ని సంప్రదించాలి)
చేదోడుకు గతం లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.ప్రస్తుతానికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేదు.ప్రస్తుతం రీ వెరిఫికేషన్ కి వచ్చినవారి అప్లికేషన్ లు మాత్రమే రీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది గమనించగలరు.
చేదోడు ఎలిజిబుల్ లిస్ట్ కొరకు సచివాలయాన్ని సంప్రదించ గలరు.