18 నుంచి ఉచిత రేషన్ పంపిణీ

రాష్ట్రంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి జనవరి 18వ తేదీ నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలియజేశారు.


కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం గరిబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ కార్డు లోని ఒక్కొక్క లబ్ధిదారునికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు.

ఈ పథకాన్ని కేంద్రం డిసెంబర్ నుంచి మార్చి కి పొడిగించింది. గత నెలలో సరిపడా నిల్వలు లేనందువలన పంపిణీ వాయిదా వేశారు. జనవరిలో  రెండు నెలలు కలిపి ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వనున్నారు.

PM GARIB KALYAN ANNA YOJAN (PM-KAY)

ఈ పథకాన్ని పేద ప్రజలకు మరియు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయుటకు ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా

మొదటి విడత   ఏప్రిల్ 2020- జూన్ 2020
రెండో విడత      జూలై 2020 – నవంబర్ 2020
మూడో విడత     మే 2021- జూన్ 2021
నాలుగో విడత   జులై2021 – నవంబర్ 2021
ఐదో విడత        డిసెంబర్2021- మార్చ్ 2022

Leave a Reply

Your email address will not be published.