gramavolunteer.com

AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..AP పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి……..

JAGANANNA SMART TOWNSHIP FULL DETAILS

JAGANANNA SMART TOWNSHIP

నగర పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి వారి సొంతింటి కలలను నెరవేర్చే లక్ష్యంతో ఈ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ (ఎం ఐ జి) ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫ్లాట్ కి 10 శాతం చెల్లించి ఫ్లాట్ ను బుక్ చేసుకోవచ్చు. ఫ్లాట్ కి అయ్యే ఖర్చు మొత్తం నాలుగు విడతల్లో చెల్లించవలసి ఉంటుంది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక లేఅవుట్లో 10 శాతం కేటాయించనున్నారు. ఫ్లాట్ ధర లో 20 శాతం తగ్గించు ఉన్నారు.

 

మొదటి దశలో అనంతపురము జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వై.ఎస్.ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లే అవుట్ లలో నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. త్వరలో మలి దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ పథకం అమలు..

మొదటి విడతగా ప్రాంతాలవారీగా ప్రారంభించబోయే లేఅవుట్ వాటి ధరలు.

JAGANANNA SMART TOWNSHIP LAYOUT ప్రత్యేకతలు

న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్…. గవర్నమెంటే లే అవుట్లు చేస్తుంది…..

కుటుంబాల అవసరాలను బట్టి 150, 200 మరియు 240 చదరపు గజాల స్థలాలు ఎంచుకునే వెసులుబాటు….

పర్యావరణ హితంగా ఉండేలా లే అవుట్ విస్తీర్ణంలో ఏకంగా 50 శాతం వరకు స్థలం సామాజిక అవసరాలకు కేటాయింపు..

• విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్ తో ఫుట్ పాత్లు.. ఎవెన్యూ ప్లాంటేషన్

• మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు..

విద్యుచీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు..

పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకు మరియు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాల కేటాయింపు..

• లే అవుట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరియు పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా సంయుక్త నిర్వహణ..

JAGANANNA SMART TOWNSHIP అర్హతలు

ఒక ఫ్లాట్ లో ఒక ఫ్యామిలి కి మాత్రం రావడం జరుగుతుంది.

దరఖాస్తుదారు ని వయసు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.

దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యుండాలి.

వార్షిక ఆదాయం 18 లక్షల కంటే తక్కువ ఉన్న వారు ఈ పథకానికి అప్లై చేయవచ్చు.

అప్లై చేయు విధానం

అర్హత కలిగిన వారు ఫ్లాట్ ని కొనాలనుకుంటే https://migapdtcp.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు సమయంలో మొత్తం ఫ్లాట్ యొక్క ధర లో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం

ఆన్లైన్లో అప్లై చేసుకున్న దరఖాస్తు అన్నిటిని కంప్యూటర్ విధానంలో పూర్తి పారదర్శకతతో లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు.
ప్రతి లేఅవుట్ కు ప్రభుత్వ ఉద్యోగులకు 10% కేటాయిస్తారు.

ఎంపిక అయిన వారు కేటాయించిన ధర చెల్లించు విధానం.

ఎంపిక దారుడు దరఖాస్తు సమయంలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని మొదటి విడతగా పరిగణించవచ్చు.

కొనుగోలు ఒప్పందం (agreement) కుదిరిన నెలరోజుల లోపు 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని రెండో విడత పరిణమించవచ్చు.

ఆరు నెలల్లోపు మరో 30 శాతం చెల్లించాలి. దీనిని మూడో విడత గా పరిగణించవచ్చు.

మిగిలిన 30 శాతం నగదును ఏడాదిలోపు చెల్లించాలి. దీనిని నాలుగో విడత గా పరిగణించవచ్చు.

 

అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు ప్లాట్ విలువ ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5% మేరకు ఆకర్షణీయమైన రాయితీ కలదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via