YSR vahana Mitra scheme 2023 | Application status | launch date | application pdf
వైఎస్ఆర్ వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్
వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర”
2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు…
‘వైఎస్సార్ వాహన మిత్ర’ క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు…!!
వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ అనగా మీ యొక్క అప్లికేషన్ అప్రూవ్ అయినాధ లేదా రిజెక్ట్ అయినదా తెలుసుకోవచ్చును. అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Vahana Mitra సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.
వాహన మిత్ర పథకానికి సంబందించి లబ్ధిధారుల ఖాతాలో జమ అగుటకు ఆధార్ కి లింకు అయిన బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే జమ అగును. ఆధర్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింకు అయినాదో తెలుసుకొనుటకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యగలరు.
వాహనమిత్ర కి కావాల్సిన డాక్యుమెంట్లు
1). RC బుక్ జిరాక్స్
2). డ్రైవింగ్ లైసెన్స్
3). కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
4). ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
5). బ్యాంకు బుక్ ≈ మొదటి పేజీ జిరాక్స్
6). ఆధార్ కార్డు జిరాక్స్
7). రైస్ కార్డు జిరాక్స్
8). ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.
వాహనమిత్ర అప్లికేషన్ పిడిఎఫ్
వాహన మిత్ర పథకానికి కొత్తగా ధరకాస్తు చేసుకొనుటకు కావలసిన అప్లికేషన్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.