gramavolunteer.com

విద్యుత్ మీటర్ కి ఆధార్ అనుసంధానం చేసే విధానం

Grama ward Volunteer app New Version Download Now

విద్యుత్ మీటర్ కి ఆధార్ అనుసంధానం చేసే విధానం

కొత్తగా అప్డేట్ అయిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వాలంటరీ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత సేవల డెలివరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది, ఇక్కడ విద్యుత్ మీటర్ కి ఆధార్ అనుసంధానం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను.

ఇక్కడ సర్వే తీసుకోండి మరియు పూర్తిచేసిన సర్వే వివరాలు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.సర్వే చేయడానికి సర్వే తీసుకోండి అని ఆప్షన్ని క్లిక్ చేసి సర్వే చేయవలసిన కుటుంబాలను సర్వే చేయవలసి ఉంటుంది.

 

పూర్తి చేసిన సర్వే వివరాలు ఆప్షన్ మీద క్లిక్ చేసిన సర్వే పూర్తి చేసిన కుటుంబ వివరాలు కనిపిస్తాయి.

ఒక కుటుంబ విద్యుత్తు మీటర్ ఆధార్ అనుసంధానం చేయడానికి సేవలు డెలివరీ లోని విద్యుత్ మీటర్ కి ఆధార్ అనుసంధానం అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత,సర్వే తీసుకోండి ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వే చేయాల్సిన కుటుంబ వివరాలు కనిపించడం జరుగుతుంది.

ఏ కుటుంబాన్ని సర్వే చేయాలి అనుకుంటున్నామో ఆ కుటుంబాన్ని ఎంచుకోవాలి. కుటుంబాన్ని ఎంచుకున్న తర్వాత మరొక స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, అక్కడ డి స్కీమ్ రకం మరియు వారి ఇంటికి సంబంధించిన మీటర్ నెంబర్  నమోదు చేయవలెను.

డి స్కీమ్ రకం ఎంపిక చేయు విధానం

డి స్కీమ్ రకాలు APEPDCL, APCPDCL, APSPDCL, అని మూడు రకాలుగా వుండును.

APEPDCL – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి

APSPDCL :- నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల

APCPDCL :- కృష్ణ, గుంటూరు, ప్రకాశం

ఏ జిల్లా వారు ఆ జిల్లాకు సంబంధించిన డి స్క్రీo రకం ను ఎంచుకోవాలి.

ఉదాహరణకు:- శ్రీకాకుళం జిల్లా వారు APEPDCL ను ఎంచుకోవాలి.

దయచేసి సరైన సర్వీస్ నంబర్ను నమోదు చేయండి అనే ఆప్షన్ దగ్గర ఆ ఇంటికి సంబంధించిన కరెంట్ మీటర్ నంబర్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయవలెను.

ఇక్కడ ఆ సర్వీస్ నంబర్ కి అనుసంధానం ఆయన పేరు మరియు ఆధార్ నెంబర్, అడ్రస్ మొదలగునవి కనిపించడం జరుగుతుంది.

ఇక్కడ పైన పేర్కొన్న పేరు సరైనదేనా అవును కాదు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.

1`

 

(a)పైన చూపించిన వివరాల దగ్గర ఆ కుటుంబానికి సంబంధించిన పేరు ఉన్నట్లయితే అవును అని సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ కుటుంబానికి సంబంధించిన పేరు చూపించక పోయినట్లయితే కాదు అని సెలెక్ట్ చేసుకోవాలి.

(b) పైన పేర్కొన్న సర్వీస్ నంబర్ సరైన ఆధార్ నంబర్ కి ట్యాగ్ చేయబడిందా? అనే దగ్గర అవును కాదు అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి.

ఈ సర్వీస్ నెంబర్ కి లింక్ అయ్యి ఉండే ఆధార్ నెంబర్ అక్కడ చూపించిన పేరుకు సంబంధించిన వారిది అయినట్లయితే అవును అని సెలెక్ట్ చేసుకోవాలి.

పేరు మరియు ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నట్లయితే కాదు అని సెలెక్ట్ చేసుకోసుకోవలేను.

(a) పైన పేర్కొన్న పేరు సరైనదేనా అనే దగ్గర కాదు అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పేరు మార్చడానికి కారణం ఎంచుకోవాలి.

(b) పైన పేర్కొన్న సర్వీస్ నెంబర్ సరైన ఆధార్ నెంబర్ కి ట్యాగ్ చేయబడిందిదా కాదు అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే యజమాని యొక్క సరైన ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి.

grama ward cvolunteer

ఇక్కడ capture frontside of aadhar దగ్గర ఆధార్ యొక్క ముందు భాగాన్ని ఫోటో తీయాలి.

Capture Backside of aadhar దగ్గర ఆధార్ యొక్క వెనుక భాగాన్ని ఫోటో తీయాలి

ఫోటో తీసిన తర్వాత యజమానితో సంబంధాన్ని నమోదు చేయాలి.పైన చూపిన వివరాలు కుటుంబ పెద్దలు అయినట్లయితే సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి కుమారుడివి అయినట్లయితే son అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via