gramavolunteer.com

new voter registration online

18 సంవత్సరాలు పూర్తి అయిన వారు ఓటు హక్కు కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయాలి.

పై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

VOTER’S SERVICE PORTAL కి సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసుకుని వున్నట్లయితే లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓటర్ సర్వీస్ పోర్టల్ కి సంబంధించి ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకొని లేనట్లయితే Sign -Up బటన్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ (Mobile Number/Gmail) పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. Login అయిన తర్వాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.


కొత్తగా ఓటు నమోదు కొరకు Fill Form 6 మీద క్లిక్ చేయాలి,Fill Form 6 మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

A. Select state, district & assembly/parliamentary constituency వివరాలకు సంబంధించి State దగ్గర ఓటు అప్లై చేసుకునే వారి యొక్క రాష్ట్రాన్ని ఎంచుకొని District దగ్గర వారి యొక్క డిస్టిక్ ని సెలెక్ట్ Select AC దగ్గర వారి యొక్క నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. తరువాత Next మీద క్లిక్ చేయాలి.

B. Personal Details వివరాలకు సంబంధించి First Name దగ్గర వారి యొక్క పేరు మాత్రమే నమోదు చేయాలి. Surname దగ్గర అభ్యర్థి యొక్క ఇంటిపేరు నమోదు చెయ్యాలి.Upload Photograph కి సంబంధించి Choose file మీద క్లిక్ చేసి అభ్యర్థి ఫోటోను అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
C.Name and Surname of any one of the relatives వివరాలకు సంబంధించి Father, mother, husband, wife, Legal Guardian in case of orphan/Third Gender వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని వారి సంబంధించిన వివరాలు నమోదు చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.

D. Contact Details వివరాలకు సంబంధించి 3.Mobile Number దగ్గర వారి ఫోన్ నెంబర్ అయితే Self మీద క్లిక్ చెయ్యాలి వారి రిలేటివ్స్ సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే Relative mentioned above సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ని వెరిఫై చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.

E Aadhar Details వివరాలకు సంబంధించి ఆధార్ నంబర్ దగ్గర సెలెక్ట్ చేసుకుని అభ్యర్థి యొక్క ఆధార్ నంబర్ను నమోదు చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.

తదుపరి జెండర్ వివరాలు మరియు డేటాఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి, ప్రూఫ్ ఆఫ్ డేటాఫ్ బర్త్ కు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పదవ తరగతి మార్కు లిస్టు లేదా ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ లేదా ఇండియన్ పాస్పోర్ట్ వీటిలో మనకి అందుబాటులో ఉన్నదాన్ని ఒకదాన్ని ఎంచుకొని అప్లోడ్ చేయాలి.

H. Present address details కి సంబంధించి వారి యొక్క అడ్రస్ వివరాలను నమోదు చేసి అడ్రస్ ప్రూఫ్ కు సంబంధించి వాటర్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ కనెక్షన్ బిల్ లేదా ఆధార్ కార్డ్ లేదా కరెంట్ పాస్బుక్కు లేదా ఇండియన్ పాస్పోర్ట్ వీటిలో మనకు అందుబాటులో ఉన్న ఎంచుకొని అప్లోడ్ చేయాలి.

I. Category of disability, if any వివరాలకు సంబంధించి డిజేబుల్ అయితే వివరాలను నమోదు చేయాలి.

J. THE DETAILS OF FAMILY MEMBER ALREADY INCLUDE IN THE ELECTROL ROLL AT CURRENT ADDRESS WHICH WHOM I CURRENTLY RESIDE ARE AS UNDER వివరాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఓటు ఉన్న వారి ఒకరియొక్క ఆ ఓటు ఉన్న వ్యక్తి యొక్క ఇతనికి సంబంధం ఓటు కార్డు నెంబర్ నమోదు చేసి నెక్స్ట్ మీద క్లిక్ చెయ్యాలి.
డిక్లరేషన్ వివరాలు మరియు క్యాప్చర్ వివరాలను నమోదు చేసి Preview and submit మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసిన వివరాలు చూపించడం జరుగుతుంది వాటిని సరిచూసుకొని ఫైనల్ గా సబ్మిట్ చేయవలెను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via