gramavolunteer.com

NPCI Linking Status

మే నెల పెన్షన్ నగదును లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది పెన్షన్ లబ్దారులు ఉన్నారు. 48,92,503 మందికి బ్యాంక్ ఖాతాలో జమ చేయమన్నారు. మిగిలిన 16,57,361 మందికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

DBT ద్వారా పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అయిన వారికి సంబంధించి ఎవరికి అయితే పేమెంట్ సక్సెస్ అయిందో వారికీ ఏ బ్యాంక్ లో అయితే అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ బ్యాంక్ వివరాలు సంబధిత WEA/WWDS SS PENSION LOGIN లో ENABLE అవ్వడం జరిగింది.

(అమౌంట్ DBT ద్వారా క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళకి మరల DOOR TO DOOR ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంది.)

బ్యాంక్ లో పెన్షన్ నగదు జమ అయ్యే వారికి ఏ బ్యాంకులో పడుతుందో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.

పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. Image2 కనిపిస్తున్న విధంగా ఓపెన్ అవుతుంది. Enter Aadhar number దగ్గర లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. Enter captcha దగ్గర పక్కన బాక్స్ లో ఇచ్చినటువంటి క్యాప్చను నమోదు చేసి Login with OTP మీద క్లిక్ చేయవలెను. ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి OTP వెళ్తుంది దానిని ఎంటర్ చేసి Login బటన్ మీద క్లిక్ చెయ్యగా image3 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

Bank Seeding Status లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది image4 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఆధార్ ఏ బ్యాంక్ లింక్ అయినది, లింక్ అయిన బ్యాంక్ ఆక్టివ్ లో వుందా ఇన్ ఆక్టివ్ లో వుందా తెలుసుకోవచ్చును.

గమనిక: ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆధార్ కి లింక్ అయి వుంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ కి పెన్షన్ నగదు జమ అవ్వడం జరుగును.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via