gramavolunteer.com

aadudham andhra survey process in volunteer app

ఆడుదాం ఆంద్రా క్లస్టర్ వారీగా సర్వే రిపోర్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. 

ఆడదాం ఆంధ్రకు సంబంధించి వాలంటీర్లు వారి క్లస్టర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వే కొరకు ఆడదాం ఆంధ్ర అని ఆప్షన్ ను గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వే అనేది డిసెంబర్ 4 నుంచి ప్రారంభం జరుగుతుంది.

గ్రామ వార్డు వాలంటీర్లు ముందుగా అప్డేట్ అయినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ను ఈ క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి

వాలంటీర్ యొక్క CFMS ID ను నమోదు చేసి బయోమెట్రిక్/ఫేస్/ఐరిస్ ల ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక హోం పేజీలో కనిపిస్తున్నటువంటి ఆడుదాం ఆంధ్ర అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్రింది Image2 లో కనిపించిన విధంగా ఆ క్లస్టర్లో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ ఎంత మంది వీరిలో ఎంతమందికి సర్వే పూర్తి చేయడం జరిగింది ఎంతమందికి సర్వే పెండింగ్లో ఉంది చూపించడం జరుగుతుంది ఇక్కడ చూపించినటువంటి ప్రతి ఒక్కరికి సర్వే చేయవలసి ఉంటుంది.

ఇక్కడ సర్వే చేయడానికి ఒక వ్యక్తి పేరు మీద క్లిక్ చేయాలి వారి వయసు 15 సంవత్సరాల పైన ఉన్నట్లయితే ఈ క్రింది విధంగా బహుమతులు మరియు వాటి ప్రైజ్ మనీ చూపించడం జరుగుతుంది.
ప్రశ్న1 : మీరు కూడా ఈ ఆట లో పాల్గొనాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు వారు ఆటలో పాల్గొనాలి అనుకుంటే అవును అని ఒకవేళ పాల్గొనకపోతే కాదు అని ఎంచుకోవాలి.

అవును అని ఎంచుకున్నట్లయితే ప్రశ్న1a. ఈ క్రింది చూపిన ఆటల్లో ఏమైనా ఒకటి లేదా రెండు ఆటలు ఎంచుకోండి అని రెండో ప్రశ్న చిన్నటడం జరుగుతుంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో బాట్మింటన్ వీటిలో రెండు మాత్రమే ఎంచుకోవాలి.
ప్రశ్న1b. ఫోన్ నంబర్ దగ్గర ఆ పౌరుని ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి.

వయస్సు 8 సంవత్సరాలు కంటే ఎక్కువ 15 సంవత్సరాలకంటే తక్కువ ఉన్న వారి వున్నట్లయితే ఈ క్రింది విధంగా బహుమతులు వాటి ప్రైస్ మనీ వివరాలు మరియూ ప్రశ్న1 ప్రేక్షకులుగా పాల్గొనుటకు పౌరుడికి సమాచారం అందించారా ఆ ప్రశ్నకు అవును అనే దగ్గర టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via